రైనా మళ్లీ వచ్చాడు

ముంబైః సౌతాఫ్రికాతో జరగబోయే మూడు టీ20ల సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాకు చాలా రోజుల తర్వాత మరో అవకాశం ఇచ్చింది. ఈ మధ్యే యొ యొ టెస్ట్ పాసవడంతోపాటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సెంచరీతో అదరగొట్టాడు రైనా. కేవలం 49 బంతుల్లో సెంచరీ కొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రైనా చివరిసారి గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడాడు. అయితే రహానేతోపాటు మరో సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌కు సెలక్టర్లు మరోసారి హ్యాండిచ్చారు. ఐపీఎల్ వేలంలో రూ.11.5 కోట్లు పలికి సంచలనం సృష్టించిన జయదేవ్ ఉనద్కట్‌కు కూడా టీమ్‌లో చాన్స్ దక్కింది. మిగతా టీమ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఫిబ్రవరి 18 నుంచి టీ20 సిరీస్ జరగనున్నది. 18న జోహనెస్‌బర్గ్‌లో తొలి టీ20, సెంచూరియన్‌లో ఫిబ్రవరి 21, కేప్‌టౌన్ ఫిబ్రవరి 24న జరుగుతాయి. ఇండియా టీ20 టీమ్‌ః కోహ్లి, రోహిత్, ధావన్, రాహుల్, రైనా, ధోనీ, కార్తీక్, పాండ్యా, పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, జయదేవ్ ఉనద్కట్, శార్దూల్ ఠాకూర్

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*