ముక్కు వద్దు ప్లీజ్.. నాకిష్టమైనది అదే!

 

బాలీవుడ్ బడా మూవీ ‘పద్మావత్’ చేసిన హల్‌చల్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఎన్నో అడ్డంకులు.. మరెన్నో విమర్శల మధ్య జనవరి 25న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ హిట్‌టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. అంతేగాక వంద కోట్ల గ్రాస్‌ను కూడా కొల్లగొట్టింది. అయితే కర్ణిసేన చెప్పిన్నట్లు సినిమాలో రాణి పద్మినిపై ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించలేదు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. అయినా కర్ణిసేన కార్యకర్తల కళ్లు మాత్రం చల్లారట్లేదు. చిత్రం విడుదలకు ముందు హీరోయిన్‌గా చేసిన పొడుగుకాళ్ల సుందరీ దీపిక పదుకొణె తల, ముక్కు తీసుకోచ్చిన వారికి కోట్లలో నజరానా అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దీపికకు మళ్లీ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో చెప్పింది. ‘పద్మావత్’ మూవీలో నటించినందుకు నా తల, ముక్కు నరికితే నగదు ఇస్తామని ప్రకటించారు. పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. కాని నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. కాళ్లు పొడవుగా ఉంటాయి.. కావాలంటే వాటిని తీసుకోండి అంటూ దీపిక చమత్కరించింది. అయితే, ఇలా బెదిరించే వాళ్లను నమ్మడానికి లేదని దీపిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను పద్మావత్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశానని.. తన తదుపరి చిత్రంపై దృష్టిసారించినట్లు తెలిపింది. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తన తరువాతి చిత్రం ఉంటుందని దీపిక చెప్పింది.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*