పాదయాత్రలో జగన్ మరో మైలురాయి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మైళ్లు.. నెలల తరబడి ప్రయాణం.. ఫ్యామిలీని వదిలి ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం అయ్యేందుకు.. వారి కష్టనష్టాలు తెలుసుకునేందుకు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో మరో మైలురాయి నమోదైంది. గత ఏడాది నవంబరు 6న మొదలైన జగన్ పాదయాత్ర నిర్విరామంగా సాగుతోంది. అలుపు వచ్చినా.. అలసట వచ్చినా.. అనారోగ్యం ఇబ్బంది పెట్టినా ఎక్కడా రాజీ పకుండా.. ఎంతకూ తగ్గకుండా ముందుకెళుతున్న జగన్ తన పాదయాత్రలో 1800 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఏపీ లోని బాబు దుర్మార్గ సర్కారు తప్పుల్ని ఎండగడుతూ.. ఆయన పాలనలోని లోపాల్ని ఎత్తి చూపిస్తున్న ఆయన.. ప్రజలకు తానేం చేస్తానన్న విషయాన్ని వివరిస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతున్న జగన్ పాదయాత్ర ఈ రోజు (బుధవారం) 1800 కిలోమీటర్ల మైలురాయిని కృష్ణా జిల్లా గణపవరం వద్ద దాటేశారు. ఈ సందర్భంగా జగన్ కు పార్టీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తన పాదయాత్రలో భాగంగా మొత్తం మూడు వేల కిలోమీటర్ల మేర నడవాలన్న లక్ష్యంతో సాగుతున్న జగన్ తన పాదయాత్ర మరికొన్ని నెలల పాటు సాగనుంది.

వైఎస్సార్ కడపజిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటివరకూ అనంతపురం.. చిత్తూరు.. కర్నూలు.. నెల్లూరు.. ప్రకాశం.. గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకొని ప్రస్తుతం కృష్ణా జిల్లాల్లో కొనసాగుతోది. మొత్తం 125 నియోజకవర్గాల్నికవర్ చేస్తూ మూడు వేల కిలోమీటర్లు జగన్ నడవనున్నారు. తాజాగా పూర్తి చేసిన 1800 కిలోమీటర్లతో ఆయన మరో 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది.
పాదయాత్రలో కీలక మైలురాళ్లు చూస్తే..

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*